రామగుండంలో మెడికల్ కాలేజీ..రెవెన్యూ డివిజన్‌గా చెన్నూర్‌

726
KCR meeting TRS
- Advertisement -

సుజల తెలంగాణ,సుఫల తెలంగాణే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. గోదావరిఖనిలో జరిగినపెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రచార సభలో మాట్లాడిన సీఎం రామగుండంలో మెడికల్ కాలేజీ..రెవెన్యూ డివిజన్‌గా చెన్నూర్‌ మారుస్తానని ప్రకటించారు.

దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎన్నికలు అనగానే ఆగంఆగం కావొద్దన్నారు. ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్,బీజేపీ ఆగం చేశాయన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్నామని చెప్పారు. మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు.

గోదావరి ఖని రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతమని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నేతకాని వెంకటేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. దేశంలో సంపద,వనరులు అపారంగా ఉన్నాయని వాటిని వాడుకునే తెలివి కాంగ్రెస్,బీజేపీ నేతలకు లేదన్నారు.

దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సింది పోయి ఒకరినొకరు విమర్శించుకోవడమే సరిపోతుందన్నారు. రాహుల్-మోడీ బొమ్మలను చూసి ఆగం కావొద్దన్నారు. దేశంలో అపార మేథోశక్తి కలిగిన యువత ఉందన్నారు. రాహుల్,మోడీ సభలకు జనం లేక వెళవెళబోతున్నాయని తెలిపారు. దేశంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే అన్నారు. 16 ఎంపీలను గెలిపిస్తే దేశ గమనాన్ని మారుస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -