- Advertisement -
జమ్ములో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ రైల్వే స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలు, 18 డిటొనేటర్లతో కూడిన బ్యాగ్ ను భద్రతా దళాలు కనుగొన్నాయి. వెంటనే వాటిని సీజ్ చేసినట్లు వివరించారు.రెండు బాక్సుల్లో వీటితో బాటు కొన్ని వైర్లు, 500 గ్రాముల వాక్స్ తరహా మెటీరియల్ కనిపించిందని, ఇవి ప్యాక్ చేసి ఉన్నాయని తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్‌లో ‘శౌర్య దినోత్సవాల’లో పాల్గొన్న సమయంలోనే జమ్మూలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హర్యానాలోని సూరజ్ కుండ్ లో 2 రోజుల చింతన్ శిబిర్ కి హాజరైన నేపథ్యంలో ఓ పెను ముప్పును నివారించగలిగామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి
ఆపరేషన్ లోటస్‌పై నోరు విప్పాలి
10 రోజులు బ్యాంకులు బంద్
సమంత “యశోద” ట్రైలర్ అదిరిపోయింది
- Advertisement -