సమంత “యశోద” ట్రైలర్ అదిరిపోయింది

136
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ప్యాన్ ఇండియా  సినిమా యశోద. ఈ చిత్రం టీజర్ గురువారం విడుదలైంది.  ట్రైలర్ ను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో విడుదల చేశారు. ట్రైలర్ లో సమంత డైలాగ్ లు ఎమోషనల్ అందరిని కట్టిపడేస్తున్నాయి. మీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్ళు వినిపించాయా, ఒక బిడ్డని మోస్తున్న తల్లికి మాత్రమే ఆ విధమైన చప్పుడు వినిపిస్తుంది అంటూ సమంత మాటలతో ట్రైలర్ సాగింది.

ఈ సినిమాలో ఆమె గర్భవతిగా కన్పించనున్నారు. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి

45ఏళ్ల జీవితంలో గుర్తుపెట్టుకునే సినిమా

రాజగోపాల్ రెడ్డి వల్లే ఉప ఎన్నిక

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రం

 

- Advertisement -