పసుపు బోర్డు కోసం పోరాటం చేశా:ఎంపీ కవిత

682
mp kavitha pasupu board
- Advertisement -

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని రాజీలేని పోరాటం చేశానని స్పష్టం చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్గట్ల మండలంలో ప్రచారం నిర్వహించిన కవిత పసుపు బోర్డుపై లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టామని,కేంద్రమంత్రులకు అనేక వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు.

గతేడాది 150 కోట్ల రూపాయలతో ఎర్రజొన్నను నష్టం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఏర్గట్లలో సాగునీటి ప్రాజెక్టు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రూ.11 కోట్ల ఎర్రజొన్న రైతుల బకాయిలు తీర్చామన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 24గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు.

ఇళ్లులేని పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తం. సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి దేశంలో కూడా జరగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కవిత కోరారు. ఈ రోడ్‌షోలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -