సినిమా ప్రపంచం లో ఒకరి మధ్య ఇంకొకరికి ఎఫైర్లు నడుస్తున్నాయి అని వార్తలు రావడం కామన్. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ ఏమైనా ఉందంటే అది యాంకర్స్ చేస్తున్న హంగామానే. యాంకర్ గా తక్కువ టైమ్ లో ప్రేక్షకులతో పాటు ఫిల్మ్ సెలబ్రెటీలను సైతం ఆకట్టుకున్న బ్యూటీ రష్మీ. ఈ మద్య కాలంలో ఇటు స్మాల్ స్క్రీన్, అటు సిల్వర్ స్క్రీన్ కి అందుబాటులో ఉంటుంది.ముఖ్యంగా రష్మీ స్మాల్ స్క్రీన్ లో వస్తున్న జబర్ధస్త్ అనే కామెడీ ప్రొగ్రామ్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
ఆ షో ద్వారానే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దల పరిచయాలను పెంచుకుంది. అయితే రష్మీ బుల్లితెర, వెండితెరపై ఎంత పాపులారిటీని సంపాదించుకుందో, అంతే స్థాయిలో రూమర్లను కూడా సంపాదించుకుంది. రష్మీ అంటే రూమర్లు, ఎఫైర్లు అనే స్థాయికి చేరింది. ఇప్పుడు ఈ అమ్మడుపై మరొకరితో ఎఫైర్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
రష్మితో సింగర్ గీతామాధురి భర్త నందు రొమాన్స్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే ఇదంతా రియల్ లైఫ్ కాదు…. రీల్ లైఫ్లో మాత్రమే! నందు- రష్మి జంటగా కొత్త ప్రాజెక్ట్ రానుంది. ఓ జంట మధ్య రిలేషన్ మొదలయ్యాక వాళ్లద్దరి విభేదాలను బేస్ చేసుకుని రాబోతోన్న సినిమా ఇది. త్వరలో సైట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ప్రభాకరన్ అనే వ్యక్తి తొలిసారి దర్శకుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు.
గతంలో రష్మి-నందు కలిసి చాలా కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే! ఈ సందర్భంగా మాట్లాడిన నందు.. తను, రష్మి మంచి ఫ్రెండ్స్ అని, ఆమెతో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా వుందని చెప్పుకొచ్చాడు. అందులోనూ రొమాంటిక్ మూవీ అంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు.