గత కొన్ని సంవత్సరాలుగా సరిగా ఉపయోగించుకోలేక పోతున్న రాష్ట్ర ప్రభుత్వ టీవీ చానల్ మన టీవీని పూర్తిగా మార్చి ప్రజలందరికీ అందుబాటులో తీసుకుని వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించింది. గత పదిహేనేళ్లుగా టీవీ నడుస్తున్నప్పటికీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గత ప్రభుత్వాలు విఃలమయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖా పరిధిలో ఉన్న మన టీవీని పూర్తి స్థాయిలో మార్చి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులు, రైతలు, గృహిణుల ఉపయోగాలే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో ఈ చానెళ్లను 2001 నుండి రిసీవ్ ఓన్లీ టెర్మినల్ ద్వారా సుమారు 60వేల పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రసారాలు అందిస్తున్నారు. ఇందులో చాలా వరకూ ఇప్పటికే పాడయ్యాయి. దీని పునరుద్ధరణకు మంత్రి చొరవ చూపడంతో ఐటీ శాఖ ఈసారి బడ్జెట్ లో నిధులు కేటాయించింది.
ఇప్పటి దాకా ఉన్న సొసైటీని పేరు, బైలాస్ మార్చి సాప్ట్ నెట్ గా పేరు మార్చింది. ఈ సాప్ట్ నెట్ కు టీవీ మీడియాలో విస్తృత అనుభవం కలిగిన శైలేష్ రెడ్డిని సీఈవోగా నియమించారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన శైలేష్ రెడ్డితో పాటు తెలంగాణ ఐటీ శాఖా డిజిటల్ విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతంలను టీవీ చానెళ్లను నిర్వహిస్తున్న గుజరాత్ లో పర్యటించి నివేదిక సమర్పించాలని మంత్రి కోరారు. మంత్రి సూచనతో వీరిద్దరూ అక్కడి బైసాక్ నెట్ వర్క్ ద్వారా నడిపిస్తున్న 16 చానళ్లు, వాటి కార్యక్రమాలు, నిధుల కేటాయింపులు , టీవీ చానళ్ల సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు అంశాలను పరిశీలించి మంత్రికి నివేదిక సమర్పించారు. తర్వాత జరిగిన సమావేశంలోమంత్రి కేటీఆర్ మన టీవి నయా రూపానికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు, యువకులకు శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలుండాలన్నారు. దీంతో పాటు విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ అందేలా చూడాలన్నారు. దీంతో పాటు రైతులకు ఎప్పటికప్పుడూ సలహాలు సూచనలు ఇచ్చేలా కార్యక్రమాలుండాలని తెలిపారు. గృహిణులకు సైతం ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్కిల్స్ పైన సహాయపడేలా పలు కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
ఇప్పటికే మనటీవీ సిబ్బంది ప్రభుత్వంలోనిపలు శాఖలతో సమావేశం అయి వారి శాఖ వారీగా ఏఏ అంశాలను హైలైట్ చేయాలి అనే అంశంపైన చర్చించారు. వారి ప్రాధాన్యతల మేరకు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కసరత్తులు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు మన టీవీని ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అనుకూలంగా సాంకేతిక పరిజ్ఞానం మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. ఇప్పుడున్న ఆర్‌వోటీల స్థానంలో డిజిటల్, కేబుల్, డిష్ టీవీ వంటి ప్లాట్ ఫాంల ద్వారా మన టీవీ రిచ్‌ని ప్రతి ఇంటికి చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇస్రో చైర్మన్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. కేయూ బ్యాండ్ నుంచి సి బ్యాండ్‌కు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పూర్తి స్థాయిలోపునరుద్ధరణ చేస్తున్నమన టీవీకినూతన పేరు, లోగోను పెట్టేందుకు ముందుకు రావాలన ప్రజలకు పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఒక మంచి పేరు,క్రియేటివ్ లోగో సూచించినవారికి51వేల బహుమతిని ఇస్తామని సాప్ట్ నెట్ సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ పేరు లోగోలను ఐటీ శాఖ వెబ్ సైట్‌లో సూచించాలనికోరారు. దీంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోఉన్న మనటీవీ కార్యాలయంలో నేరుగా కానీ, పోస్ట్ ద్వారా కానీ సమర్పించవచ్చని తెలిపారు.