స్వామి నిత్యానంద.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. చిత్రవిచిత్ర గెటపులతో – చిల్లర పనులతో – హీరోయిన్స్ తో రచ్చ రచ్చ చేశాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అనంతరం తాను మగాడిని కాదని “ఆ పని”కి పనికిరానని చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే నిత్యానంద ఎంత ఫేమస్సో – అతడి అనుంగ శిష్యురాలుగా పేరుపొందిన సినీనటి రంజిత కూడా అంతే ఫేమస్.
కేవలం గురువు నిత్యానంద వారి “సేవ”లోనే తరించే ఈమే కూడా అప్పట్లో ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారో ఏమో కానీ.. ఈ మధ్య కాలంలో వీరిద్దరికీ సంబందించిన వార్తలు రావడం బాగా తగ్గింది.. ఈ విషయాలపై ఫీలయ్యే వారికో శుభవార్త తాజాగా వెలుగులోకి వచ్చింది!
దసరా నాటికి ప్రారంభమయ్యే ఓ టీవీ చానెల్‌లో రంజిత దర్శనమివ్వబోతుందని సమాచారం. నిత్యానంద ప్రవచనాలను, ఆయనను ప్రమోట్ చేసే విధంగా ఆ టీవీ చానెల్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ భక్తి చానెల్ ను ఒక తెలుగు దినపత్రిక అధినేత నిర్వహిస్తారని.. ఆయన నిత్యానందకు ఉన్న వీర భక్తుల్లో ఒకరని చెబుతున్నారు. తెలుగులో ప్రారంభమయ్యే భక్తి చానెల్‌ను రంజిత డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
90వ దశకంలో పలు తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించిన రంజిత మావి చిగురు లాంటి సినిమాతో బాగా గుర్తింపు పొందింది. ఆపై సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోకుండా నిత్యానందుడి పాదదాసిగా మారిపోయింది. ఇక దసరా నుంచి ప్రారంభం కాబోయే ఈ చానెల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు స్వామివారి ప్రవచనాలు అందించేందుకు రెడీ అయిపోతుంది.