గర్ల్ ఫ్రెండ్‌తో అఖిల్..

278
- Advertisement -

మొన్నటి వరకు చైతూ- సమంత లవ్ లో పడ్డారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. వాళ్ల గురించి అక్కినేని ఫ్యామిలీలో డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయని వార్త హల్ చల్ చేసింది. చైతూ- సామ్ ల వ్యవహారం ఒకవైపు నడుస్తుంటే…నేనేం తక్కువ తిన్నానా అని నాగచైతన్య తమ్ముడు అఖిల్ కూడా ప్రేమలో పడిపోయాడన్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేసింది.

అయితే త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఈ మధ్య కాలంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఖిల్ కూడా తాను ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోవడమే ఇందుకు కారణం. అఖిల్ తాను ప్రేమలో పడ్డట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆమె వివరాలు బయటకు లీక్ అయ్యాయి. శ్రేయా భూపాల్ అనే డిజైనర్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడని.. హైదరాబాద్ లోని ఓ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసి పోయింది.

Akhil

అయితే అఖిల్ ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు రావడమే తప్పితే… ఇప్పటి వరకు అఖిల్ ఆమెతో కలిసి కనిపించింది లేదు. ఎట్టకేలకు అఖిల్ తన ప్రియురాలితో కలిసి కెమెరాకు చిక్కాడు. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో అఖిల్ తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

- Advertisement -