ఎన్టీఆర్‌ని కట్నం అడగలేదు…ఆయన ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంచు లక్ష్మీతో కలిసి మోహన్ బాబు….చంద్రబాబును కలిశారు. తన పెళ్లి రోజు సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు చంద్రబాబు. 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు. 28 ఏళ్లకే మంత్రి నయ్యానని….తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మంత్రి పదవి కావాలని చెన్నారెడ్డిని అడిగానని తెలిపారు బాబు.
మంత్రిగా ఉన్నప్పుడు జయకృష్ణ తన దగ్గరికి వచ్చేవాడని…అనురాగదేవత షూటింగ్లో తొలిసారి ఎన్టీఆర్‌ని కలిశానని తెలిపాడు. తొలిభేటీలోనే రాజకీయాలపై చర్చ జరిగిందని…చెన్నైలో జరిగిన తన వివాహానికి అనేకమంది సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారన్నారు. ప్రధాని పదవి టెంపరరీ పోస్టని….సీఎం పదవి పర్మినెంట్ పోస్టని నా కొడుకు లోకేష్ చెప్పాడన్నారు బాబు.బాలకృష్ణ కోసం కట్టిన ఇంట్లో ఉండమని చెప్పిన…తాను వద్దన్నానని తెలిపారు.
కలాంను రాష్ట్రపతిగా చేసినప్పుడు చాలా చర్చ జరిగిందని….అందరం కలిసి వాజ్ పేయ్‌ని ఒప్పించామని తెలిపారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు రాజీనామా అడిగానో వివరించానని..ఎన్నికల తర్వాత కూడా చాలా సార్లు చర్చించామని పాత జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు బాబు.