జూబిన్ గార్గ్ డెత్…సింగపూర్‌కు సిట్

9
- Advertisement -

గాయకుడు జూబిన్ గార్గ్ మర్మమైన మరణంపై జరుగుతున్న దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించడానికి అస్సాం పోలీస్‌ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) అక్టోబర్ 21న సింగపూర్‌కి ప్రయాణించనుంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జోక్యంతో, సింగపూర్ ప్రభుత్వం SIT బృందానికి అనుమతి ఇచ్చిందని అస్సాం సీఎం వెల్లడించారు.

సింగపూర్‌లో ఇటువంటి ఘటనలపై దర్యాప్తు పద్ధతి చాలా క్రమబద్ధమైనదని ఆయన తెలిపారు. “సింగపూర్‌లో ఇలాంటి ఘటనల తర్వాత పోలీసు శాఖకు మూడు నెలలపాటు కఠినమైన గోప్య దర్యాప్తు విధానం ఉంటుంది. ఆ సమయంలో వారు ఎటువంటి పబ్లిక్ స్టేట్‌మెంట్లు ఇవ్వరు, ఎవరినీ కలవరు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కేసును కోరోనర్ కోర్ట్‌కు సమర్పించి, పూర్తి నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు అని ఆయన చెప్పారు.

అస్సాం రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న జూబిన్ గార్గ్ మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, దుఃఖాన్ని కలిగించింది. ఆయన మరణం పట్ల ప్రజల్లో ఆవేదనతో పాటు న్యాయం కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి, అస్సాం అడ్వకేట్ జనరల్ సిఫారసు మేరకు ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కూడా నియమించనున్నట్లు శర్మ ప్రకటించారు.

Also Read:తెలంగాణ బంద్ విజయవంతం చేద్దాం..

- Advertisement -