తెలంగాణ బంద్ విజయవంతం చేద్దాం..

12
- Advertisement -

అక్టోబర్ 18వ తేదీన తెలంగాణ బంద్ నీ విజయవంతం చేద్దామని అన్ని రాజకీయ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. బేగంపేట్ టూరిజం ప్లాజా లో బీసీ సంఘాల సమావేశం జరిగింది.

బీసీ సంఘాలు, బీసీ ప్రతినిధులు సమావేశం. వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరుగగా స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశం ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, వీ హనుమంతరావు,మధుయాష్కి, పుట్ట మధు, నెల్లికంటి సత్యం, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:SYG అవుట్ స్టాండింగ్ సినిమా!

- Advertisement -