ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా

318
cec
- Advertisement -

తెలంగాణ స్ధానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేసింది ఈసీ. వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన వినతి మేరకు కౌంటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఫలితాలు ఎప్పుడు వెల్లడించేది త్వరలోనే చెబుతామని తెలిపింది.

రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

మొదటి దశ పోలింగ్‌ మే 6న,రెండో దశ మే 10న,మూడో దశ పోలింగ్ మే 14న జరిగింది. ఫలితాలు ఈ నెల 27న వెలువడనుండగా వాయిదా వేసింది ఈసీ. దీంతో స్ధానిక సమరంలో పోటీచేసిన అభ్యర్థులు మరిన్నిరోజులే వేచిచూడక తప్పదు.

- Advertisement -