ధోనీ బ్యాటింగ్ .. జీవా సందడి..

217
Ziva Wants 'Daddy's Hug' During IPL Match
- Advertisement -

నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‎తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. 198 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. 44 బంతుల్లో(6×4, 5×6) 79 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చివరి క్షణాల్లో విజృంభించినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది.

ఓవైపు ధోని భారీ షాట్లతో చెలరేగుతుంటే మరోవైపు ధోనీ ముద్దుల కూతురు జీవా మహీ బ్యాటింగ్‎ను చూసి ముద్దు ముద్దు మాటలతో సందడి చేైసింది. తల్లి సాక్షితో కలిసి గ్యాలరీలో ఉన్న జీవా ,తన తండ్రి ధోనీ దగ్గరికి వెళ్లాలని తల్లిని అడిగింది. మీ నాన్న దగ్గరికి వెళ్తే ఏం చేస్తావ్ అని పక్కనున్న వారు అడగగా హగ్ చేసుకుంటానని ముద్దు ముద్దు మాటలతో జవాబిచ్చింది. ఎలా హగ్ చేసుకుంటావని తల్లి సాక్షి అడగగా జీవా చేసి చేసి చూపించింది. ధోనీ మైదానంలో ఎక్కడున్న విషయాన్ని కూడా జీవా చేతితో చూపించింది. ఈ వీడియోను మ్యాచ్ అనంతరం ధోనీ అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోపై అభిమానులు తమ దైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు.

- Advertisement -