ట్రంప్ డిమాండ్‌పై జెలెన్‌స్కీ

3
- Advertisement -

రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదన చేశారు. తమకు నెల రోజుల పాటు శక్తివంతమైన పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను అందిస్తే.. అదే సమయంలో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. తమ దేశ ఇంధన వ్యవస్థపై రష్యా దాడులు ఆపితే తాము కూడా ప్రతీకార దాడులు చేయబోమని పేర్కొన్నారు.

రష్యా తమ విద్యుత్, గ్యాస్, చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నప్పుడు తాము మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు.రష్యా తమ ఇంధన వ్యవస్థపై దాడులు నిలిపివేస్తే తాము కూడా ఆ దేశంలోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు చేయబోమని జెలెన్‌స్కీ తెలిపారు. మరో ప్రత్యామ్నాయంగా తమకు పేట్రియాట్ క్షిపణులు అందించాలని అమెరికాను కోరారు. ఇందుకు అవసరమైన డబ్బును తామే సమకూర్చుకుంటామని, అమెరికా నుంచి ఉచిత సాయం మాత్రమే ఆశించడం లేదని చెప్పారు.

Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న

అమెరికా నెల రోజుల పాటు ఈ క్షిపణి వ్యవస్థలను అందిస్తే.. ఆ నెల రోజుల పాటు రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు నిలిపివేస్తామని వివరించారు. రష్యా ప్రయోగించే డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడంలో పేట్రియాట్ క్షిపణులు ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన ఆయుధాలుగా ఉన్నాయి.

ఈ ప్రతిపాదన ద్వారా ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారా? అన్న ప్రశ్నకు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. భాగస్వామ్య దేశాల మధ్య వాస్తవాలను వెల్లడించేందుకు తానేమీ ఆందోళన చెందడం లేదని సమాధానమిచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో జరగాల్సిన చర్చలు ఈ నెలలో మళ్లీ ప్రారంభం కానున్నాయి. అయితే ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఈ చర్చలు దాదాపుగా నిలిచిపోయాయి.

- Advertisement -