తీరం వైపు దూసుకొస్తున్న మురసు

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడింది. ప్రస్తుతం వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం మురసు తుఫాన్ కేంద్రం చెన్నైకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరుకు 290 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ సమాచారం వెల్లడిస్తోంది. తుఫాన్ కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మురసు తుఫాన్ ఇవాళ రాత్రికే తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు నుంచి నరసాపురం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు సమాచారం. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న

తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత, వర్షపాతంపై అధికారులు నిఘా ఉంచారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. తుఫాన్ గమనంపై వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -