పుతిన్ చస్తేనే యుద్ధం ఆగుతుంది!

3
- Advertisement -

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ చస్తేనే యుద్దం ఆగుతుందన్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. పుతిన్‌ త్వరలో చనిపోతారని, అప్పుడే యుద్ధం ముగిసిపోతుందని మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం జెలెన్‌స్కీ చేసిన ఈకామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల పుతిన్‌ ఆరోగ్యంపై ఊహాగానాల వచ్చాయి. పుతిన్‌ దగ్గుతున్నట్లు, ఆయన కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జెలెన్‌ స్కీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

అయితే రష్యా అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వచ్చింది.

- Advertisement -