రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఉక్రయిన్ పూర్తిగా ధ్వంసమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు రష్యాపై ఎదురుదాడికి దిగింది ఉక్రెయిన్. ఆదివారం రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్లతో దాడికి దిగింది ఉక్రెయిన్. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది.ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీనిపై స్పందించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. క్రమంగా యుద్ధం రష్యా భూభాగానికి తిరిగి వస్తోంది. ఆ దేశ ప్రతీకాత్మక కేంద్రాలు, సైనిక స్థావరాలకు వ్యాపిస్తోంది. ఇది అనివార్యమైన, సహజమైన, పూర్తి న్యాయమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.
Also Read:రెడీ అయిన జగన్..ఎమ్మెల్యేలకు గుబులు!
మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయని ఉక్రెయిన్ వెల్లడించగా దీనిని ఉగ్రదాడిగా రష్యా అధికారులు వెల్లడించారు.
Also Read:ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!