ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం!

47
- Advertisement -

ఆగస్టు మొదటి వారంలో కూడా థియేటర్‌ ల్లో కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అలాగే, మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్న కంటెంట్ పై ఓ లుక్ వేద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

‘ఎల్‌జీఎం’ :

భారత మాజీ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని నిర్మాతగా మారి చేపట్టిన మొదటి నిర్మాణం ‘ఎల్‌జీఎం’ (LGM). ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

‘రాజుగారి కోడిపులావ్’ :

ఇది ఈ వారం వస్తోన్న ఓ చిన్న సినిమా. శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. ఈ సినిమా కూడా ఆగస్టు 4న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

‘విక్రమ్‌ రాథోడ్‌’ :

విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’. ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే :

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

చూనా (హిందీ సిరీస్‌) ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

రంగబలి (తెలుగు) ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ 3 (హాలీవుడ్‌) ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

దయా (తెలుగు సిరీస్‌) ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

పరేషాన్‌ (తెలుగు) ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -