ఆ బాధ మెగాస్టార్ లో ఇప్పటికీ ఉందట

43
- Advertisement -

బేబీ మూవీ మెగా సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి యువతకి, పేరెంట్స్‌కి ఒక మెసేజ్ లాంటింది. ఈ జనరేషన్ యువత ఫోన్ కు బాగా ఆకర్షితులై, అనేక సమస్యల్లో పడుతున్నారు. ఒక బలహీనమైన క్షణంలో తెలిసో, తెలియకో చిన్న వయసులోనే తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో తెలియక బయపడి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు అని చిరు అన్నారు. అయితే, ఈ కామెంట్స్ పై యాంటీ మెగాఫ్యాన్స్ చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు నిజమే అని, ఒక బలహీనమైన క్షణంలో తెలిసో, తెలియకో చిన్న వయసులోనే ప్రేమలో పడి తప్పులు చేస్తున్నారని.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురి శ్రీజ కూడా అప్పట్లో ఇలాంటి తప్పే చేసిందని.. ఆ బాధ చిరు లో ఇప్పటికీ ఉందని.. అందుకే బేబీ సినిమాకి చిరంజీవి బాగా కనెక్ట్ అయ్యారని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఈ పోస్ట్ ల్లో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి అయితే ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read:రెడీ అయిన జగన్..ఎమ్మెల్యేలకు గుబులు!

మరోవైపు తన జీవితంలో అనేక మధురఘట్టాలు చోటుచేసుకున్నాయని ఇదే బేబీ విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ వైపు పుత్రోత్సాహం, మరోవైపు తోబుట్టువుల అభివృద్ధి, ఇంకోవైపు మేనల్లుళ్ళ ఎదుగుదల, మిత్రుల అభివృద్ధి వర్ణించలేని ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అభిమానులు తనకి దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు అని హర్షం వ్యక్తం చేశారు. తన సన్మాన సభకు వచ్చినట్లు అనిపిస్తోందని చిరు కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ను వైరల్ చేసే పనిలో ఉన్నారు.

Also Read:నితిశ్ మళ్ళీ ఎన్డీయే లోకి?

- Advertisement -