ఈడీ విచారణకు యువరాజ్‌

8
- Advertisement -

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు యువరాజ్. ఇదే కేసులో ఇప్పటికే సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, రాబిన్‌ ఉతప్పను విచారించారు ఈడీ అధికారులు. బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కు కూడా సమన్లు జారీ చేసింది ఈడీ.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBet కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయనను విచారించి, నివేదిక నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే కేసులో ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వేషి జైన్ కూడా ED ఎదుట హాజరయ్యారు.

ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలపై జరుగుతున్న దర్యాప్తు, కోట్లాది రూపాయలను మోసం చేసి, పన్నులు ఎగ్గొట్టినట్లు ఉన్న ఆరోపణలతో సంబంధం ఉన్న ప్లాట్‌ఫారమ్‌లపై ED విస్తృత విచారణలో భాగంగా కొనసాగుతోంది.

Also Read:వాహనాలపై కులం పేర్లు..జరిమానా!

- Advertisement -