సినిమా టికెట్ రేట్లపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా అయినా సరే టికెట్ ధర రూ.200 మించకూడదని ధర పరిమితిని విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ఆదేశాలు చేయగా దీనిపై స్టే విధించింది కర్ణాటక హైకోర్టు.
సినిమా టికెట్ రేట్లపై కర్ణాటక ప్రభుత్వం విధించిన పరిమితిపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలు.
విచారణ జరిపిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం విధించిన టికెట్ రేట్ల పరిమితిపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణ జరిపి, తుది తీర్పు వచ్చే వరకు టికెట్ రేట్ల పరిమితిని విధించకూడదు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:వాహనాలపై కులం పేర్లు..జరిమానా!

