భారీ స్కోర్‌ చేసిన సన్‌రైజర్స్‌..

208
Yuvraj Singh expects Ben Stokes to be a hot
- Advertisement -

ఉప్పల్‌లో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫోర్లు, సిక్సర్లు లక్ష్యంగా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు.

మరో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ హన్రిక్స్‌(52: 3ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించే దిశగా సాగుతోంది. దీపక్‌ హుడా(2), యువరాజ్‌(42)తో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌(40) మంచి శుభారంభం అందించాడు.

అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌సింగ్‌ పదో సీజన్‌లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తం 27 బంతులాడిన యువీ(62) 7 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోరు దిశగా సాగింది. తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యంత వేగవంతంగా అర్ధశతకం పూర్తి చేసి మరో రికార్డును లిఖించుకున్నాడు యువరాజ్‌.

కాగా..  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తొలి మ్యాచ్ ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబద్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. యువీ చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లకు జట్టు స్కోర్ 207/4. యువీ 27 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయ లక్ష్యం 208 పరుగులు.

- Advertisement -