లేడీ ఓరియంటెడ్‌… ‘వోడ్కా’

206
Vodka Movie Updates
- Advertisement -

‘వోడ్కా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎల్‌ సెవెన్‌ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ‘వోడ్కా’ (వాయిస్‌ ఆఫ్‌ గర్ల్‌) అనేది ఉప శీర్షిక. షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. లోరా అమ్ము ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీవి, ప్రమోద్‌చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధా, సూర్యతేజ ఇతర పాత్రధారులు. లోగడ ‘ఓల్డ్‌సిటీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సలీం మాలిక్‌ దర్శకత్వంలో లోరా అమ్ము ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్‌ ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓల్డ్‌సిటీ సలీం మాలిక్‌ మాట్లాడుతూ ”వోడ్కా వైవిధ్యం ఉన్న చిత్రం. చలన చిత్ర చరిత్రలోనే ఇలాంటి భిన్నమైన సినిమా తొలిసారి నిర్మాణమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్‌ సినిమా” అని చెప్పారు.

నిర్మాత లోరా అమ్ము మాట్లాడుతూ ” హైదరాబాద్‌లో టాకీపార్ట్‌ చిత్రీకరణ జరిపిన అనంతరం పాటలను వైజాగ్‌, అరకు లొకేషన్లలో చిత్రీకరిస్తాం. మంచి చిత్రాలను అందించాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను” అని తెలిపారు.

ఈ చిత్రానికి కథ: రాజశేఖర్‌ సలాది (యాష్‌), ఛాయాగ్రహణం: శివకృష్ణ. వై, సంగీతం: నందన్‌ రాజ్‌.

- Advertisement -