పూరి హీరోయిన్‌కి హృతిక్‌ జలక్‌..

172

రోగ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచమైయిన బ్యూటి ఏంజెలా క్రిస్లిజింకీ. సినిమాలో ఏంజెలాది పెద్దపాత్ర కాకపోయినా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఏంజెలానే మెయిన్ హీరోయిన్ అన్న రేంజ్ లో ప్రమోట్ చేశాడు.

అంతేకాదు ఏంజిలా కూడా రోగ్ ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో జోరుగా పాల్గొంటుంది. అయితే రోగ్ ప్రమోషన్ లో భాగంగా ఈ బ్యూటి  ఓ ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ  ఇంటర్వ్యూ ఈ అమ్మడుకి కష్టాలు తెచ్చిపెట్టింది. అయితే పూరి హీరోయిన్ ఆ ఇంటర్వ్యూలో తెగ రెచ్చిపోయింది. దాంతో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు కోపమొచ్చేసింది.
 Hrithik Roshan was shocked by Rogue heroine
అసలు హృతిక్‌ కి కోపమొచ్చేలా ఏంజిలా ఇంటర్వ్యూలో ఏం మాట్లాడిందంటే.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనకు మంచి స్నేహితుడని, తన తీసుకునే ప్రతి నిర్ణయం హృతిక్ ని సంప్రదించాకే తీసుకుంటానని తెలిపింది.

 Hrithik Roshan was shocked by Rogue heroine

అయితే ఈ ఇంటర్య్వూపై స్పందించాడు హృతిక్. అంతేకాకుండా పేపర్ కటింగ్ ను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేస్తూ, ‘ మై డియర్ లేడీ, నువ్వు ఎవరు..? ఎందుకు అబద్ధం చెపుతున్నావ్..?’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఏంజిలాకి దిమ్మతిరిగిపోయినట్టైందనే చెప్పాలి.

అయితే ఏంజెలా గతంలో హృతిక్ తో కలిసి కొన్ని యాడ్స్ లో నటించింది. అయితే అవేవి హృతిక్ గుర్తు పెట్టుకునే స్థాయి పాత్రలు కాదు. అయితే ఈ అమ్మడుని గుర్తు పట్టలేని హృతిక్, ఏంజెలా ఇంటర్య్వూ పై కామెంట్ చేశాడు. ఇక ఈ బ్యూటీ కూడా హృతిక్ కామెంట్‌ పై స్పందించింది. అయితే ఇంటర్వ్యూలో అలా హృతిక్‌ గురించి చెప్పినందుకు, హృతిక్‌ కోపానికి ఏంజెలా సారీ చెప్పక తప్పలేదు. మొత్తానికి హృతిక్‌ వల్ల పూరి హీరొయిన్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయిందనే చెప్పాలి.

Hrithik Roshan was shocked by Rogue heroine