రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్న యువరాజ్‌!

262
yuvraj singh

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన యువీ తన మనసు మార్చుకున్నాడు.

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన యువీ…తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యువీ పేర్కొన్నాడు. మూడు నాలుగు వారాలపాటు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

ప్రస్తుతం యువరాజ్ పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు. ఇటీవల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన రెండు శిక్షణ శిబిరాలకు హాజరయ్యారు. దీంతో యువీకి మళ్ళీ ఆటపై మనసు మళ్లీందని దీంతో బీసీసీఐ చీఫ్ గంగూలీకి యువీ లేఖ రాశాడని తెలిపారు బాలి.