ఆయిల్ ఫామ్‌ సాగుకు ప్రోత్సాహం: నిరంజన్‌రెడ్డి

225
niranjan reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయిల్ ఫామ్‌ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి….రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు.

ఆయిల్ ఫామ్ రంగం ద్వారా వ‌చ్చే ఉపాధి అవ‌కాశాలు, స్థూల ఆదాయంతో రాష్ర్టానికి ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్ ఉంటుందని తెలిపారు. మార్కెట్ విధానం దృష్టిలో ఉంచుకుని పంట‌ల‌ను సాగు చేయాల్సిన అవ‌స‌రం ఉందని…. ఈ ఏడాది కందులు, వ‌రికి ప్రాధాన్య‌త ఇచ్చారు. నూత‌న పంట‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుందన్నారు.

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు కోటి 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు సాగు అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల వ‌రి నాట్లు వేస్తున్నారు. ఈ సాగు విస్తీర్ణం ఏటేటా పెరిగిపోతోందన్నారు. పామాయిల్ దిగుమతికి కేంద్రం 40 వేల కోట్లు వెచ్చిస్తోంది….దీనిని దృష్టిలో ఉంచుకుని 18 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ఆయిల్ ఫామ్‌ను సాగు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు.

- Advertisement -