భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్,ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 38వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ,బీసీసీఐతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ,హర్భజన్,జస్పిత్ బుమ్రా,శిఖర్ ధావన్,రాజీవ్ శుక్లా ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు.
1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించిన యువీ 2000 సంవత్సరంలో వన్డే క్రికెట్ ఆరంగేట్రం చేశారు. 2003లో తొలి టెస్టు ఆడిన యువీ 17 ఏళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన యువీ ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.
తన సుదీర్ఘ కెరీర్‌లో 304 వన్డేలు,40 టెస్టులు,58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ భారత్‌కు చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. ముఖ్యంగా భారత్ ధోని సారథ్యంలో టీ20,వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.
ప్రస్తుతం కెనడా టీ20లో టొరంటో నేషనల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యువీ. టీ20ల్లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన యువరాజ్..ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాధి సంచలనం సృష్టించాడు. క్యాన్సర్ ను జయించిన తర్వాత నటి హాజల్ కీచ్ ని పెళ్లిచేసుకున్నారు యువీ.
అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో ఒక టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్‌గా గుర్తింపుపొందాడు. వన్డేల్లో 26 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. అందులో రెండు మ్యాచుల్లో తప్ప అన్ని మ్యాచులు భారత విజయానికి ఉపయోగపడ్డాయి.
Yuvraj Singh celebrates his 38th birthday, A true champion and an inspiration to many, here’s wishing @YUVSTRONG12