‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎన్టీఆర్ అఫీషియల్ లుక్..

657
RRR
- Advertisement -

టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దశలో ఉంది. అయితే ఇటీవల చిత్రికరణ సమయంలో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వేళ, ఆయన లుక్, సన్నివేశాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అయింది. దీంతో జక్కన్న టీం అప్రమత్తమైంది. తాజాగా ఎన్టీఆర్ అఫీషియల్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ss-rajamouli

తలపాగా, గడ్డంతో సీరియస్ గా చూస్తున్నట్టు ఉన్న ఎన్టీఆర్ లుక్ మరింత వైరల్ అవుతోంది. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌కి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌,హలీవుడ్‌ భామ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. డి వి వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 300కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

SS Rajamouli’s Ram Charan and Jr NTR starrer RRR is one the most-awaited films for 2020. And the closely guarded look of Jr NTR was leaked..

- Advertisement -