ఓపెనింగ్‌ కోసం ఆ నలుగురే పోటీ:యూవీ

514
- Advertisement -

2023లో జరగబోయే ప్రపంచకప్‌కు భారత ఆటగాళ్లలో ఓపెనింగ్‌ కోసం చాలా మంది పోటిపడుతున్నారని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌(సిక్స్‌ల హీరో) అన్నారు. ప్రముఖ సంస్థకు ఇంటర్వూలో మాట్లాడుతూ… ప్రస్తుతం భారత జట్టకు ఓపెనింగ్‌ కోసం చాలా మంది పోటిపడుతున్నారు. కేఎల్‌రాహుల్‌ రోహిత్‌ ధావన్ ఉన్నారని వీరితో పాటుగా శుభ్‌మన్‌ కూడా పోటీలో ఉంటారని జోస్యం చెప్పారు.

శుభ్‌మన్‌ గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడని కూడా తెలిపారు. అయితే మిడిలార్డర్‌ గురించి ఇప్పుడేం చెప్పలేమని అది భవిష్యత్‌ నిర్ణయిస్తుందని తెలిపిన యూవీ ప్రస్తుతం మాత్రం ఓపెనింగ్‌ కోసం పోటీ ఉందన్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అర్ధ సెంచరీ సాధించాడు. అతను 2022లో భారత్‌ తరపున 12వన్డేల్లో మొత్తం 638పరుగులు చేశాడు. అందులో 4అర్ధ సెంచరీలు మరియు 1సెంచరీ సాధించాడని తెలిపారు. అతని సగటు 70కి మించి ఉందని తెలిపిన యూవీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 15వన్డేలు ఆడాడని రాబోయే 10యేళ్లలో అతను విజయాలు సాధిస్తాడని యూవీ తెలిపారు.

ఈ సందర్భంగా క్రీడల అభివృద్దికి సహాయం చేయడంలో నాకేమీ అభ్యంతరం లేదన్నారు. క్రికెట్‌ మాత్రమే కాదు ప్రతి ఆటను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

మారని భారత్ ఆటతీరు!

అన్నింటిలో మేటి మన తెలంగాణ:కేటీఆర్‌

చౌక ధరకే 5G ఫోన్స్‌…ఇవే!

- Advertisement -