రివ్యూ : యుద్ధం శరణం

247
Yuddham Sharanam Movie Review
- Advertisement -

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించిన నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం  యుద్ధం శరణం. చైతూ చిన్న‌నాటి స్నేహితుడైన కృష్ణ మారిముత్తు దర్శకత్వంలో థ్రిల్లర్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన చైతూ…యాక్షన్‌ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్నాడా..?విలన్‌గా శ్రీకాంత్‌ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం….

కథ:

అర్జున్‌(నాగచైతన్య) బాగా చదువుకున్న కుర్రాడు. మంచి ఉద్యోగం వచ్చినా, వదిలిపెట్టి తన అభిరుచి కొద్దీ ఆకాశంలో ఎగిరే డ్రోన్‌ తయారు చేసే పనిలో ఉంటాడు. అర్జున్ తల్లిదండ్రులిద్దరూ(రావు రమేష్,రేవతి)  డాక్టర్స్…ఓ  స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించే పనిలో ఉంటారు.  వీరి దగ్గర ఇంట‌ర్న్ షిప్ చేయాల‌ని వ‌చ్చిన అంజ‌లి (లావ‌ణ్య త్రిపాఠి), అర్జున్‌తో ప్రేమ‌లో ప‌డుతుంది. అంతా స‌వ్యంగా సాగుతుంద‌నగా ముర‌ళీ దంప‌తులు చ‌నిపోతారు. వారిది హ‌త్యా? ప్ర‌మాద‌మా? ..ఆ సంఘటన జరిగిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అనేది తెరమీద చూడాల్సిందే..

Yuddham Sharanam Movie Review
ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్టాఫ్ కామెడీ, నటీనటులు.  నాగచైతన్య తన పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయాడు. అద్బుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్రం చేశాడు.  లావణ్య త్రిపాఠి నటనకు వంక పెట్టలేం.  రావు రమేష్‌, రేవతిలు తల్లిదండ్రుల పాత్రల్లో ఒదిగిపోయారు.  పెళ్లిచూపులు ఫేం   ప్రియదర్శి తన మార్క్‌ కామెడీతో మెప్పించారు.  శ్రీకాంత్‌ రూపంలో ఇండస్ట్రీకి మరో విలన్‌ దొరికాడానే చెప్పాలి. తన నటన, కరకైన చేష్టలతో  ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్  కథ, సన్నివేశాల్లో వేగం తగ్గడం. క‌థ‌లో కొత్త‌ద‌నం కనిపించదు. పాట‌లు బాగా లేవు.  అటు రాజ‌కీయ‌నాయ‌కుడిగా చేసిన వినోద్ కుమార్‌గానీ, ఇటు నాయ‌క్‌గా న‌టించిన శ్రీకాంత్ పాత్ర‌లు కానీ బ‌లంగా లేవు. ఇంట‌ర్వెల్ కూడా పెద్ద‌గా ఏమీ ర‌క్తి క‌ట్టించ‌దు. క‌థా, క‌థ‌నం పేల‌వంగా ఉంది.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి.వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం బాగున్నా, పాటలు గుర్తుండిపోయేలా లేవు. తన తొలి చిత్రమే అయినా దర్శకుడు మారిముత్తు ఎంతో పరిణతితో రాసుకున్న కథను తెరపైకి తీసుకొచ్చాడు. కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. వారాహి సంస్థ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Yuddham Sharanam Movie Review
తీర్పు :

వరుసగా రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్‌ సినిమాల తర్వాత నాగచైతన్య నటించిన చిత్రం యుద్దం శరణం. ఫస్టాఫ్ కామెడీ,నటీనటులు సినిమాకు ప్లస్ కాగా రోటిన్ స్టోరీ,సన్నివేశాల్లో వేగం తగ్గడం సినిమాకు మైనస్ పాయింట్స్.  మొత్తంగా `యుద్ధం శ‌ర‌ణం` ఒక రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం.

విడుదల తేదీ: 08/09/2017
రేటింగ్‌:2.5 /5
నటీనటులు: నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్‌, లావ‌ణ్య త్రిపాఠి
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
నిర్మాత: ర‌జ‌నీ కొర్ర‌పాటి
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ మారిముత్తు

- Advertisement -