కూటమి మేనిఫెస్టో.. వైసీపీలో గుబులు!

14
- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఇప్పుడు అందరి చూపు పార్టీల మేనిఫెస్టోలపై పడింది. ఏ పార్టీ ఎలాంటి హామీలను ఇవ్వబోతుంది ? మేనిఫెస్టోల విషయంలో ప్రధాన పార్టీల ఎజెండా ఎలా ఉంది ? వాటి అమలుపై అధినేతల కచ్చితత్వం గా ఉన్నారా లేదా ? అనే అంశాలపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హామీల విషయంలో టీడీపీ మిగతా పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. గతంలోనే మినీ మేనిఫెస్టో పేరుతో ఆరు హామీలను ప్రకటించి సూపర్ సిక్స్ అంటూ వాటినే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సస్ అయింది. ఇక ఎన్నికల ముందు తాజాగా అధికార వైసీపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ ప్రజలను ఆకర్షించే విధంగా హామీలు లేకపోవడంతో సొంత పార్టీలోనే కొంత అసంతృప్తి నెలకొనిందనే టాక్ వినిపిస్తోంది..

అమ్మఓడి రూ.17 వేలకు పెంపు, చేయూత, ఆసరా వంటి పథకాల కొనసాగింపు,.. ఇలా ఆల్రెడీ అమల్లో ఉన్న పథకాలనే మేనిఫెస్టోలో చేర్చడం, కొత్త హామీలేవీ ప్రకటించకపోవడంతో వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోందనేది కొందరి అభిప్రాయం. ఇదిలా ఉంచితే టీడీపీ జనసేన కూటమి కూడా తాజాగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.1500, సామాజిక పెన్షన్ రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలకు పెంపు, వాలెంటిర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు,.. ఇలా చాలా హామీలనే ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి టీడీపీ జనసేన పార్టీలు.

అయితే బీజేపీ కూడా భాగమైనప్పటికీ జాతీయ స్థాయిలో ఆ పార్టీ హామీలు ఉంటాయని, రాష్ట్రంలో టీడీపీ జనసేన మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉంటుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి అటు వైసీపీ, ఇటు టీడీపీ జనసేన కూటమి తమ తమ మేనిఫెస్టోలను ప్రజల ముందు ఉంచడంతో ప్రజా మద్దతు ఎటువైపు ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వైసీపీతో పోల్చితే కూటమి మేనిఫెస్టోలోని హామీలే ఆకర్షణీయంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.

Also Read:KCR:ఢిల్లీ లిక్కర్ స్కాం..మోడీ కల్పితం

- Advertisement -