ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా కోసం నిన్న ఏపీలో వైసిపి బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే బంద్ అనంతరం జగన్ మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. కార్లను మార్చినట్టు పవన్ కళ్యాణ్ పెళ్లాలను మారుస్తాడన్నారు. ఇలా చేస్తే బొక్కలో వేస్తారు అన్నారు.
పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్రలో రెండు రోజుల క్రితం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. తమకు కూడా ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉంటే జగన్ లా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడిని కాదని అసెంబ్లీని స్ధంభింపచేసేవాడిని కాదని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. పెళ్లాలను మార్చడం పవన్ కళ్యాణ్ అలవాటయిపోయిందని ఇలా నాలుగు పెళ్లిలు చేసుకున్నోడిని నిత్య పెళ్లికొడుకుగా గుర్తించి జైళ్లో వెస్తారన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా మనకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అలాంటి వారికి కూడా సమాధానం చెప్పే ఖర్మ మనకు పట్టిందన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్ నోట పవన్ కళ్యాణ్ మాట రావడం ఇదే తొలిసారి. పవన్ కళ్యాణ్ నాలుగేళ్లు చంద్రబాబు, బీజేపీ తో కాపురం చేసి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేస్తుంటారన్నారు. విలువల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం చూస్తే భాదేస్తుందన్నారు. ఇక జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాన్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.