శ్రీరెడ్డిపై వ్య‌భిచారం కేసు న‌మోదు..

269
srireddy

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై కొన్ని రోజులు చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పై న‌టి శ్రీరెడ్డి యుద్దం చేసినా…కొంత మంది ఆర్టీస్టులు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచినా మ‌రికొంత మంది ఆమె మాట‌ల‌ను వ్య‌తిరేకించారు. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో ఏమాత్రం నిజం లేక‌పోవ‌డంతో శ్రీరెడ్డి చేసిన పోరాటం వృధా అయిపోయింది. గ‌తంలో ద‌గ్గుబాటి అభిరామ్, హీరో నాని, యాక్ట‌ర్ వైవా హ‌ర్ష ఇలా ప‌లువురు సెలబ్రెటీల‌పై కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే.

nani-sri-redd

ఇక తాజాగా శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో రోజు ఏదో ఒక పోస్టు పెడుతూ సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇన్ని రోజులు తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారిపై లీక్స్ గురించి మాట్లాడ‌గా..కొన్ని రోజుల నుండి త‌మిళ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌క్తుల‌పై శ్రీరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా పొస్టులు పెడుతుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్, ప్ర‌ముఖ నృత్య దర్శ‌కుడు, హీరో రాఘ‌వ లారెన్స్ , ఇలా ప‌లువ‌రిపై సోష‌ల్ మీడియాలో ప‌లు కామెంట్లు చేస్తూ వ‌స్తుంది.

Sri-Reddy-, AR Murugadoss

త‌మిళ ఇండ‌స్ట్రీపై శ్రీరెడ్డి చేస్తున్న వాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు కోలీవుడ్. ఈసంద‌ర్భంగా ఆమెపై వ్య‌భిచారం కేసు పెట్టారు ఇండియాన్ మ‌క్క‌ల్ మంద్రం అనే సంస్ధ‌. శ్రీరెడ్డి సినిమా అవ‌కాశాల కోసం ద‌ర్శ‌కులు, హీరోలు, ఇత‌రుల‌తో గ‌డిపిన‌ట్టు స్వ‌యంగా ఆమెనే అంగీక‌రిస్తున్నందున అది వ్య‌భిచారం కింద‌కే వ‌స్తుంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. చైన్నై పోలీస్ క‌మీష‌న‌ర్ కు ఈ ఫిర్యాదును అంద‌జేశారు. శ్రీరెడ్డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు న‌డిగ‌ర్ సంఘం కూడా సిద్ద‌మైన‌ట్టు తెలుస్తుంది.