దళిత బహుజనుల దేవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను తాను అవమానపరచేలా మాట్లాడలేదని..ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో నిలబెట్టాయని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వుండవల్లి శ్రీదేవి అన్నారు.. ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తాను ప్రసంగంపై దుష్ప్రాచారం చేస్తూ కొంత మంది వ్యక్తులు ఎడిటింగ్ చేసిన వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో స్పందించిన ఆమె ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మార్ఫింగ్, ఎడిటింగ్ వీడియోల వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని.. ఉద్దేశ్యం పూర్వకంగా తాను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు..ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న ఏ ఒక్కరూ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కించపరచేలా మాట్లాడరని..ఉన్నత స్థానాల్లో వెలుగుతున్న దళిత బహుజనులపై జరుగుతున్న కుట్రల్లో భాగమే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు మూలం అన్నారు…
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 75 ఏళ్లుగా విభిన్న కులాలు, మతాలు, జాతులు, అందరూ సమానంగా అనుభవిస్తూ నేడు ఉన్నత స్థితికి తీసుకొచ్చిందని ఆ ఫలాలు అనుభవిస్తున్న బహుజనులు ఎదుగుదల ఓర్చుకోలని కొందరూ వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తొలి నాళ్లలో కొంత మంది కుల వాదులు వ్యతిరేకించినప్పటికి..ఆయనతో పాటు రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా పని చేసిన బాబు జగ్జీవన్ రాం పార్లమెంటులో రాజ్యాంగ ప్రతి ఫలాలలను కింది స్థాయికి చేర్చేందుకు బలియంగా కృషి చేశారు.. అంబేద్కర్ మరణానంతరం రాజ్యాంగాన్ని అతి దగ్గరగా తెలుసుకున్న బాబు జగ్జీవన్ రాం వేసిన బాటలు..కొంత సత్ఫలితాలు ఇచ్చాయని భావాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యక్త పరిచారు….
రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్న నేపథ్యంలో కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు ఎల్లో మీడియాతో కలిసిన కొంత మంది దుష్ప్రాచారానికి పూనుకున్నారన్నారు..లేని పోని ఆరోపణలతో నాపై విష ప్రచారం చేస్తూ నేను మాట్లాడిన వీడియోని ఎడిటింగ్ చేసి…సోషల్ మీడియాలో విడుదల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని..భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
అంబేద్కర్ వాదిగా చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న నేను అటూ వైద్య వృత్తిలో, ఇటూ రాజకీయ రంగంలో పేద, బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తున్నానన్నారు.. అంబేద్కర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నట్లు తెలిపారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ఉన్నతంగా రాణిస్తున్న నేపథ్యంలో కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. కుల,మతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న మేమంతా..అంకిత భావంతో పని చేస్తున్నామని ప్రజల్లో తప్పుడు భావాలు తీసుకెళ్లడంతో ఏ ఒక్కరూ లబ్ధి పొందాలేరని నిజం తెలుసుకొని మెసలుకోవాలన్నారు…….