పుష్ప డిలీటెడ్ సీన్.. వీడియో వైరల్‌..

27

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. అయితే, సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. అందులో ఓ సన్నివేశాన్ని తాజాగా చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. యూట్యూబ్‌లో తొలగించిన సీన్‌ను పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ సీన్స్ యూట్యూబ్‌లో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీగా వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సమంత స్పెషల్ నంబర్‌లో అలరించింది. ఈ మూవీ సీక్వెల్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి మొదలుపెట్టనున్నారు.

Pushpa Deleted Scene | Allu Arjun | Rashmika Mandanna | Fahadh Faasil | Sukumar | DSP