మాజీ సర్పంచ్ నిర్వాకం..4కోట్ల కుచ్చుటోపి

20
sdpt

సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం , లక్ష్మీదేవి పల్లి లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్‌తో కలిసి నాలుగు కోట్ల కుచ్చుటోపి పెట్టారు. సుమారు వందకు పైగా దొంగ పాసుబుక్కులు సృష్టించి, నాలుగు కోట్ల వరకు దండుకున్నారు,ఈ విషయం వారికి బ్యాంకు వారు నోటీసులు ఇచ్చే వరకు కూడా ఈ విషయం వారికి తెలియదు.

రైతుబంధు పెన్షన్ డబ్బులు ప్రభుత్వ పథకాలు అన్ని ఆగిపోవడంతో, బ్యాంకు నుండి డబ్బు కట్టమని నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నరు.తల్లి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు భూదందా, బ్యాంకు మేనేజర్ తో కలిసి, అమాయకమైన రైతులను నమ్మబలికి, దొంగ సంతకాలు తీసుకుని బ్యాంక్ మేనేజర్ తో కలిసి నాలుగు కోట్ల వరకు, జేబులో వేసుకున్నాడు, భూమి ఒక ఎకరం ఉన్న వాళ్లకు ఐదు ఎకరాలు చేసి, ఏమి లేని వాళ్లకు రెండు ఎకరాలు చేసి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించి, అమాయకమైన ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు.

ఇటు బ్యాంకు వారేమో మాకు డబ్బులు కట్టాల్సిందే అని హుకుం జారీ చేశారు.. వారు ఇప్పుడు అన్ని విషయాలు తెలిసినా మా చేతిలో ఏమీ లేదంటూ మమ్మల్ని మోసం చేశారంటూ లబోదిబోమంటున్నారు.తన సంతకం పెడితే పింఛను వస్తుంది అని అబద్దమాడి తనతో బ్యాంకుకు తీసుకువెళ్లి సంతకం పెట్టి ఇచ్చాడని, పెన్షన్ రాలేదు డబ్బులు రాలేదు నన్ను మోసం చేశాడంటూ అవ్వ కన్నీరుమున్నీరైంది

దండు సురేష్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ డాక్టర్ నడిపే నన్ను క్రాప్ లోన్ ఇప్పిస్తానని చెప్పి బ్యాంకుకు తీసుకువెళ్లి సంతకం చేయించి నా పేరు మీద లోన్ తీసుకున్నాడని అది కట్టమని ఇప్పుడు బ్యాంకు అధికారుల అంటున్నారని బాధపడ్డాడు సురేష్. తన పేరుమీద గుంట జాగా లేదు అని కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తానని చెప్పి రూ.230000 తను తీసుకొని నాకు 75 వేలు మాత్రమే ఇచ్చి అది రుణమాఫీ అవుతుంది అని చెప్పి నన్ను మోసం చేసి సంతకం తీసుకొని నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ కంటతడి పెట్టింది.