Jagan:ఆరో లిస్ట్.. ఇంతకీ జగన్ ప్లానేంటి?

23
- Advertisement -

ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అంతకు మించి అనేలా ఏకంగా 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. దశల వారీగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తూ ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇప్పటివరకు ఐదు జాబితాలో అభ్యర్థులను కన్ఫర్మ్ చేసిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆరో జాబితాలో కూడా అభ్యర్థులను ప్రకటించారు. నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు గాను ఇంచార్జ్ లను తాజాగా ప్రకటించింది వైసీపీ పార్టీ. .

లోక్ సభ స్థానాలకు గాను ఇంచార్జ్ ల జాబితాలో గూడూరు శ్రీనివాస్ ( రాజమహేంద్రవరం), అడ్వకేట్ గూడూరి ఉమాబాల ( నర్సాపురం ), ఉమ్మారెడ్డి వెంకటరమణ ( గుంటూరు ), ఎన్ రెడ్డప్ప ( చిత్తూరు ).. వంటి వారు ఉన్నారు. ఇక అసెంబ్లీ స్థానాలకు గాను ఇంచార్జ్ ల జాబితాలో సర్పాల తిరుపతి రావు యాదవ్ ( మైలవరం ), అన్నా రాంబాబు ( మార్కాపురం ), ఎండి ఖలీల్ ( నెల్లూరు సిటీ ), కె. నాగార్జున ( గిద్దలూరు ), కె నారాయణస్వామి ( నేలూరు జీడీ ), బుట్టా రేణుకా ( ఎమ్మిగనూరు ). ఇలా కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

అయితే ప్రస్తుతం ప్రకటించిన కొన్ని స్థానాల్లో అసంతృప్త నినాదాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే దశల వారీగా ఇంచార్జ్ లను ప్రకటించడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందనేది కొందరి అభిప్రాయం. అన్నీ నియోజకవర్గాల అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తే పార్టీలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పైగా సీటు దగ్గని నేతలు ఒక్కసారిగా తిరుగుబాటు జరిపే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా దశల వారీగా అభ్యర్థులను కన్ఫర్మ్ చేస్తూ అసంతృప్త వాదులను బుజ్జగిస్తూ లక్ష్యం దిశగా వెళుతున్నారనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి జగన్ వ్యూహాలు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

Also Read:‘పుష్ప 2’ రేటు ఎక్కువే..కానీ లాభాలే లేవు

- Advertisement -