షర్మిల సభకు విజయమ్మ,భారతి…?

140
sharmila
- Advertisement -

ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల భారీ బహిరంగసభ,అదే రోజు పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా కరోనా నిబంధనల మేరకు సభ జరగనుంది. సభలో అందరూ మాస్కులు విధిగా ధరించాలని, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలని షర్మిల పార్టీ నేతలకు సూచించారు పోలీసులు. దీని ప్రకారమే ఏర్పాట్లు జరుగుతుండగా తాజాగా షర్మిల పార్టీకి సంబంధించి ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఖమ్మం ఇంఛార్జ్ లక్కినేని సుధీర్‌కు సూచించారు. దీంతో నిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తామని షర్మిల టీమ్‌ పోలీసులకు వెల్లడించారు.

షర్మిల బహిరంగ సభకు ఆమె తల్లి విజయమ్మ, భారతి హాజరుకానున్నారని సమాచారం. తల్లిని పక్కన పెట్టుకుని పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నారు. తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు.

ఇక సభా వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 6 వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతించడంతో ఈ మేరకు నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -