తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ పరంపర కొనసాగుతుంది. సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ల జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను మహి వి. రాఘవ్ తెరకిక్కుస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ చేసిన పాదయాత్ర.. ఆ యాత్ర చూపిన ప్రభావం, ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయనకి ఎదురైన రాజకీయ ఒడుదుడుకులు ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రానికి ‘యాత్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి చేస్తున్నారు.
మరోవైపు ఆయన సతీమణి విజయమ్మ పాత్రకు నయనతారను ఎంపిక చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. విజయమ్మ పాత్రకి రమ్మకృష్ణ అయితేనే సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తుందట, అందుకే రమ్యకృష్ణను తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా వైఎస్ తనయుడు వైఎస్ జగన్ పాత్రని సూర్య చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరీ చూడాలి ఎవరు ఏ పాత్రంలో చేయనున్నారో కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.