- Advertisement -
ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీచేస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా తాను పోటీ చేసే స్ధానంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలాగే. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఖమ్మం నేతలతో తెలిపారు.
ఏప్రిల్ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని… లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని…. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటన, పోటీ స్థానం మీద కూడా క్లారిటీ రావడంతో.. జెండా, ఎజెండా.. ఇతర అంశాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే షర్మిల పార్టీలోకి గాయకుడు ఏపూరి సోమన్న చేరగా పలువురు కాంగ్రెస్ నేతలు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
- Advertisement -