కబడ్డీ.. ఏషియన్ గేమ్స్ కు ఎంపిక సూర్యాపేటలోనే

243
jagadish reddy
- Advertisement -

47 వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆతిధ్యం ఇస్తున్న సూర్యాపేట 2022 లో జరుగనున్న ఏషియన్ గేమ్స్ కు క్రీడాకారుల ఎంపికకు కూడా వేదికగా మారింది.2022 లో జరుగు ఏషియన్ గేమ్స్ లో కబడ్డీ క్రీడాకారులను ఈ వేధికనుండే ఎంపిక చేస్తారని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ వెల్లడించారు. ఏషియన్ గేమ్స్ కు కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేసేందుకు గాను కేంద్రప్రభుత్వం పరిధిలోని జాతీయ కబడ్డీ అసోసియేషన్ ఆరుగురు సెలెక్టర్లను ఇక్కడికి పంపించిందని ఆయన వెల్లడించారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత భారత కబడ్డీ టీం మాజీ కెప్టెన్ గతంలో కబడ్డీలో ప్రపంచ కప్ సాధించడం తో పాటు కబడ్డీ క్రీడలో గోల్డెమెడలిస్ట్ అందుకున్న అజయ్ ఠాకూర్ తో పాటు మరో ఐదుగురు సెలెక్టర్లు ఇప్పటికే సూర్యాపేటకు చేరుకున్నారని ఆయన తెలిపారు. మరో ఐదుగురి లో కేంద్రప్రభుత్వం గుర్తించిన నేతాజీ ఇనిస్ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో కోచ్ గా శిక్షణ పొందిన గుల్బార్ ఖాన్ అదే ఎన్ ఐ సి లో శిక్షణ పొందిన మధ్యప్రదేశ్ కు చెందిన పోలీస్ అధికారి ఆనంద్ యాదవ్ లు ఉన్నారు.పై ముగ్గురు జూనియర్ కబడ్డీ పోటీలలో బాలుర విభాగం నుండి ఏషియన్ గేమ్స్ కు ఎంపిక చేస్తారు.

బాలికల విభాగానికి గాను సెలెక్టర్లు గా నియమితులైన ఆంద్రప్రదేశ్ కు చెందిన కోచ్ ఎన్ ఐ సి లో శిక్షణ పొంది భారత జూనియర్ బాలికల కబడ్డీ టీం కు కోచ్ గా వ్యవరిస్తున్న పద్మజా బాల ఉండగా ఆమె తో పాటు ఒరిస్సాకు చెందిన భారత రైల్వే టీం కోచ్ జయశ్రీ స్వేన్,ఎన్ ఐ సి నుండి శిక్షణ పొంది కోచ్ గా వ్యహారిస్తున్న మహారాష్ట్ర కు చెందిన అప్పా సాహెబ్ డాల్వి లు ఉన్నారు.మొత్తం ఆరుగురు కలసి సూర్యాపేట వేదికగా జరుగుతున్న జాతీయ కబడ్డీ జూనియర్ పోటీల నుండి బాలుర విభాగంలో 36 మందిని బాలికల విభాగంలో 36 మందిని చొప్పున ఎంపిక చేస్తారని జగదీశ్వర్ యాదవ్ పేర్కొన్నారు. ఎంపిక చేసిన 72 మందికి కూడా నెల విడిచి నెల చొప్పున మొత్తం మూడు నెలల శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. అంతిమంగా ఏషియన్ గేమ్స్ కు కావాల్సిన ఒక్కో టీం కు 12 మంది చొప్పున బాలబాలికల విభాగాల నుండి 24 మందిని ఎంపిక చేస్తారని ఆయన చెప్పారు.ఇక్కడి నుండి ఇప్పుడు ఎంపిక చేసిన 72 మందిని శిక్షణా కాలం లో పోటీలు నిర్వహించి వెలివేట్ చేసుకుంటూ అంతిమంగా ఒక్కో టీం లో 12 మందిని ఎంపిక చేస్తారని ఆయన చెప్పారు.

- Advertisement -