వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తపరిస్థితి తలెత్తడంతో షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అలాగే షర్మిల పాదయాత్ర అనుమతిని రద్దుచేశారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండటంతో షర్మిలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్‌ఎస్ నేత లూనావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు.
గతంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై కూడా షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఆమె యాత్రను పార్టీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..