స్లాంగ్ కోసం దర్శక రచయితల తిప్పలు

50
- Advertisement -

పుష్పలో చిత్తూరు స్లాంగ్ బాగా పేలాక అవసరం ఉన్నా లేకపోయినా ఒక ప్రాంతపు భాషని సినిమాలో జొప్పించేందుకు అధిక శాతం హీరోలు రచయితలను డిమాండ్ చేసి మరీ రాయిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ నేపధ్యంగా తీసుకున్నప్పుడు సరైన హోమ్ వర్క్ లేకుండా ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా డైలాగులు పెట్టడం వల్ల వాటిలో కృత్రిమత్వం తేలికగా బయటపడి ప్రేక్షకుల్లో నవ్వులపాలవుతోంది.

ఆ మధ్య రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో ఇలాంటి ప్రయోగమే చేయబోయి బోల్తా కొట్టారు. తాజాగా వినరో భాగ్యము విష్ణుకథలో తిరుపతి యాస కోసం ప్రయాస పడ్డారు. పోనీ సినిమా మొత్తం ఒకే ఫ్లోలో పదాలు వాడారా అంటే అదీ లేదు. కాసేపు పాత్రలు ఆ స్లాంగ్ వాడతాయి. కాసేపయ్యాక మాములు తెలుగుకు వచ్చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే సీన్ల మధ్య ఉండే కనెక్టివిటి దీని వల్ల ఎఫెక్ట్ అవుతోంది.

అరవింద సమేత వీర రాఘవ తీసినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఓ సీమ రైటర్ ని తెచ్చుకుని తన మాటలను ప్రాంతీయతకు తగ్గట్టు మార్చి రచన చేయించారు. ఇది చాలా ప్లస్ అయ్యింది. ప్రతి పాత్రలో సన్నివేశంలో సహజత్వం ఉట్టిపడింది. అలా చేస్తే ఓకే కానీ ఇలా లేనిపోని ఇబ్బందులతో తంటాలు పడే బదులు మాములుగా ఉంటేనే బెటర్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -