షర్మిలకు షాక్‌..!

48
sharmila

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలకు షాక్ తగిలింది. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న షర్మిల..తాజాగా ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల భూక్యా నరేష్ ఇంటివద్ద దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. షర్మిల తమ ఇంటికి రావద్దని…నరేష్ తండ్రి, భూక్యా శంకర్ ఓ వీడియో విడుదల చేశారు.

తన కొడుకు ఉద్యోగం రాక చనిపోయిన మాట వాస్తవమే అని.. కానీ దానిని రాజకీయంగా వాడుకోవద్దని హితవు పలికారు. తమ ఇంటికి రావద్దని షర్మిలకు తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందుతుందని తెలిపారు.

ఇక ఇటీవలె ఆ పార్టీకి చెందిన నాయకురాలు ఇందిరా శోభన్ వైఎస్‌ఆర్టీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.