కైకేయి…. ఫస్ట్ లుక్‌

314
kikeyi
- Advertisement -

కైకేయి చిత్రం సినిమా ఫస్ట్ లుక్పోస్టర్ను వైవిధ్య చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ విడుదల చేశారు. ప్రముఖ నటులు ఆమనీ, ప్రభాకర్, ప్రధాన పాత్రలలో నటించగా థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరి కడార్ల, వినయ్ రెడ్డి, పి. రాజేందర్ రెడ్డి మరియు అల్లు శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా,
సీను అండోజు రచన – దర్శకత్వం వహించిన చిత్రమిది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నగేష్ కుకునూర్ గారు మాట్లాడుతూ…ఎవ్వరు కొత్తగా సినిమాల్లో అడుగు పెట్టిన నేను చాలా సంతోషిస్తాను..సినిమా అనేది చాలా కష్టతరమైన పని, నేను అలా ఎదుగుతూ వచ్చిన వాడినే ..ఈనాడు నేను ఈ చిత్రం పోస్టర్ విడుదల ఎందుకు చేశాను అంటే, ఎవరైనా కలలు కని వాటిని నెరేవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు..నేను ఆలా కష్టపడి వచ్చిన వాడిని కాబట్టి ఇలా సపోర్ట్ చేస్తున్నాను…. గుడ్ బాడ్ అగ్లీ ఏమైనా అవ్వని ,ఇక్కడ దాకా రావడమే సక్సెస్.ఆ కష్టాన్ని దాటి మీరు ఈరోజు సినిమా తీసుకువచ్చారు ,ప్రస్తుతమున్న విద్యా వ్యవస్థ లోని ఒక పాయింట్ ను ఎంచుకుని సినిమా తీసిన ఈ బృందానికి అభినందనలు.సిబిఐటీ స్టూడెంట్స్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస శర్మ గారు మాట్లాడుతూ దర్శకుడు అండోజు కాలేజీ లోని డ్రమాటిక్స్ క్లబ్కి నేతృత్వం వహిస్తున్నారు ప్రస్తుతం తల్లి తండ్రుల మనస్తత్వం అలాగే పిల్లల భవిష్యత్ పైన వారికి ఉన్న కోరికల ఇతివృత్తంగా ఈ సినిమా తీశారు వారికి నా అభినందనలు

చిత్ర సహా నిర్మాత వెంకట్ పోలోజు గారుమాట్లాడుతూ …దర్శకుణ్ణి పూర్తిగా నమ్మి ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసాము , చిత్రం బాగా వచ్చింది ప్రజలకు చేరువ అవుతుంది అని నమ్ముతున్నాను.చిత్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ షార్ట్ ఫిలిం గా చేద్దామనుకుని ప్రారంభించాం దర్శకుని ప్రతిభను నమ్మి పెట్టుబడి పెట్టాము ఈ కథ సరైన సినిమాగా రావడం సంతోషాన్ని ఇచ్చింది.. ప్రజలకు నచ్చాలని కోరుకుంటున్నాను.చిత్ర దర్శకుడు సీను అండోజు గారు మాట్లాడుతూ ….
తల్లితండ్రులు ఏమి చేసైనా సరే పిల్లలను గొప్పవాళ్ళను చేయాలనుకుంటున్నారు, పురాణ కథలలో కుడా అలా జరిగింది:

గురు ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వద్దామ, ధృతరాష్ట్రుడు ధుర్యోధనుడిని, దశరథ మహారాజు రాముడిని ఏదేమైనా రాజులను చేయాలనుకున్నారు, వారి నిరాశ చాలా తీవ్రంగా ఉండేది కానీ చివరకి పశ్చాత్తాపమే ఫలితంగా మిగిలింది. అశ్వద్దామ శాపగ్రస్థుడుగా, గాంధారి వజ్రకాయుడిని చేసినప్పటికీ ధుర్యోధనుడు చివరికి నిండా మునిగి పోతాడు.

ఇక రాముణ్ణి అడ్డుకుంటోంది కైకేయి. ఆ మనస్తాపంతో దశరథ మహారాజు మరణిస్తాడు, రాముడు అడివిపాలుకాగా భరతుడుకి పశ్చాత్తాప జీవితం మిగుల్తాయ్. అలా ప్రేమగల తల్లీ కైకేయి పగ, పంతం వీడక చివరకు తన తప్పు తేలుసుకొని లోకకళ్యాణంకు కారణం అవుతుంది.నేటి పరిస్థితులకు అడ్డం పట్టేలా ఇటువంటి ఇతివృత్తముతో ఈ చిత్రాన్ని నిర్మించాము.మీ అందరి ఆశ్శిసుల వల్ల త్వరలో ఈ చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తాము…

నటీనటులు.
ఆమనీ, ప్రభాకర్, కునాల్ విశ్వజిత్, సంజన ఆకాశం, విశ్వ స్వరూప్ మరియు మనీష్ రెడ్డి తదితరులు…
బ్యానర్ : థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్
ఎడిటింగ్ : అనిల్ కుమార్
సంగీతం :ఫణి కళ్యాణ్ (నీవే ఫేమ్)
సహా నిర్మాత : వెంకట్ పోలోజు
నిర్మాతలు : హరి కడార్ల, వినయ్ రెడ్డి, పి. రాజేందర్ రెడ్డి మరియు అల్లు శ్రీనివాస రెడ్డి
రచన – దర్శకత్వం:సీను అండోజు

- Advertisement -