ప్రియా వారియర్ నటించిన ‘శ్రీదేవి బంగ్లా’ట్రైలర్‌..

188

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయింది మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా తొలి సినిమా కూడా విడుదల కాలేదు అప్పుడే రెండో సినిమాతో వ‌చ్చేస్తుంది ఈ అమ్మడు. అది కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది‌. క‌న్నుగీటి ఇండియా మొత్తాన్ని ఊపేసిన ప్రియా వారియ‌ర్.. ఇప్పుడు ఏకంగా శ్రీదేవి పాత్ర‌లో న‌టిస్తుంది.

తాజాగా ప్రియా వారియర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియా పాత్ర పేరు శ్రీదేవి. ఓ చిన్న పిల్లకి ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సన్నివేశంతో ట్రైలర్‌ మొదలైంది. ‘మీకు ఇష్టమైన నటి ఎవరు’ అని ఆ చిన్నారి అడగ్గా.. ‘నాకు ఇష్టమైన నటి నేనే..’ అని ప్రియా అంటారు.

Sridevi Bungalow

ఈ సినిమాలో ప్రియా హీరోయిన్‌గా నటించారు. ‘ఓ నటిగా నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. పేరు, డబ్బు, సంతోషం అన్నీ ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు. కానీ..’ అన్న డైలాగ్‌‌ వినిపిస్తున్న సమయంలో కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. ఆ తర్వాత ప్రియా ఓ పక్క ఏడుస్తూ మరోపక్క మద్యం తాగుతున్నట్లు కన్పించారు. చివర్లో బాత్‌టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించడంతో సినిమాపై అంచనాలను పెరిగాయి.