ఇక మిగిలింది పవనే.. వాట్ నెక్స్ట్ జగన్?

33
- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికి రాజకీయలు ఏ స్థాయిలో హాట్ హాట్ గా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేస్తున్న ప్లాన్స్ ప్రత్యర్థి పార్టీలను కంగుతినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించి తాము అధికారం రావాలని చూసిన చంద్రబాబుకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టారు. సరిగ్గా ఎన్నికల ముందు పలు స్కామ్ లను తెరపైకి తీసుకొచ్చి జైలుపాలు చేశారు. దీంతో టీడీపీ ఎలక్షన్ రేస్ లో ఒక్కసారిగా డీలా పడింది. ఇక మిగిలింది జనసేననే. జనసేన పార్టీని కూడా వ్యూహాత్మకంగా దెబ్బ కొడితే వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని వైఎస్ జగన్ భావిస్తున్నారు.

అయితే పవన్ దూకుడుకు జగన్ ఎలా చెక్ పెడతారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పా.. రాజకీయంగా ఆయనను ఎదుర్కోవడానికి వైసీపీ వద్ద సరైన ఆయుధం లేదు. ఎంతసేపు మూడు పెళ్లిళ్ల వ్యవహారం, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్.. ఇలా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ వాటి ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. చంద్రబాబు నాయుడి స్పీడ్ కు ఎలాగైతే అడ్డుకట్ట వేయగలిగారో అలా పవన్ ను నిలువరించడం వైసీపీకి పెద్ద టాస్కే.

ఎందుకంటే అటు సినీ ఇండస్ట్రీ లోనూ ఇటు రాజకీయాల్లో పవన్ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆయనకు సినిమాల నుంచి వచ్చిన డబ్బునే వివిధ కార్యక్రమాల రూపంలో ప్రజలకు పంచి పెడుతున్నారు. దీంతో పవన్ పై ప్రజల్లో ఎంతో కొంత సానుకూలత ఏర్పడింది. ఈసారి జనసేన ప్రభావం కూడా అధికంగానే ఉండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ను ఎలా నిలువరించాలనే దానిపై జగన్ అండ్ కో మల్లగుల్లాలు పడుతున్నారట. అయితే టీడీపీ జనసేన పొత్తు లో ఉన్న కారణంగా చంద్రబాబు చేసిన స్కామ్ లలో పవన్ కు కూడా వాటా ఉండే అవకాశం ఉందని.. పవన్ కూడా అవినీతిపరుడని ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. మరి ఈ ప్లాన్స్ పవన్ దూకుడికి ఎంతవరకు అడ్డుకట్ట వేస్తాయో చూడాలి.

Also Read:టైగర్‌ నాగేశ్వరరావు..సెన్సార్‌ రివ్యూ

- Advertisement -