నాలుగోసారి ప్ర‌భాస్ అనుష్క‌…

241
prabhas anushka
- Advertisement -

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స్టార్ హీరోయిన్ అనుష్క వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మూడు సినిమాలు తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరు క‌లిసి న‌టించిన సినిమాలు భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. బిల్లా, మిర్చి, బాహుబ‌లి సినిమాల్లో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఈజంటను మ‌రోసారి ఒకే స్క్రీన్ పై చూడాల‌ని ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. వీరిద్ద‌రి మ‌ధ్య‌లో ప్రేమ ఉంద‌ని త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబుతున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. తాజాగా వ‌స్తున్న వార్తల ప్రకారం వీరిద్ద‌రూ మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

radhakrishna

జిల్ మూవీ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ప్ర‌భాస్ తో ఓ మూవీ తెర‌కెక్కించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా పూజా హెగ్డెను ఎంచుకున్నారు. మ‌రో హీరోయిన్ గా అనుష్క‌ను తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ఇందులో అనుష్క స్పెష‌ల్ పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో షూటింగ్ లో బిజీగా ఉండ‌టంతో సంక్రాంతి త‌ర్వాత ఈప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తుంది.

- Advertisement -