అలియా భట్‌కు ఆ మెగాహీరో అంటే ఇష్టమట..!

287
Alia Bhatt
- Advertisement -

బాలీవుడ్ కథానాయిక అలియా భ‌ట్‌.. ర‌ణ్‌బీర్‌తో ప్రేమాయణంకి సంబంధించి ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య అలియా తండ్రి మ‌హేష్ భట్‌ వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని క‌న్‌ఫాం చేశారు. ఇప్పుడు వారి పెళ్లి ఎప్పుడు జ‌ర‌గ‌నుంద‌నే విష‌యంపై అభిమాన‌లు ఆరాలు తీస్తున్నారు. ఇక అలియా బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తిని చూపుతోంది. ఈ విషయం తానే స్వయంగా తెలిపింది. తన స్థాయిని మరింతగా పెంచే కథలను మాత్రమే ఆమె అంగీకరిస్తోంది.

Alia Bhatt

తాజాగా ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకి ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి అలియా భట్ స్పందిస్తూ .. తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమనీ, ఆయనతో ఒక్క సినిమా అయినా చేస్తాను అని అంది. దీనిని బట్టి అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయం అల్లు అర్జున్ వరకూ వెళ్లి, తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

- Advertisement -