‘డియ‌ర్ కామ్రేడ్’ సెట్లో పూరీ జ‌గ‌న్నాథ్..

294
dear comrade
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ప‌రిచ‌యమ‌యిన విజ‌య్ దేవ‌ర‌కొండ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్ప‌ర‌చుకున్నారు. ఆ త‌ర్వ‌త వ‌చ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోల రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇటివ‌లే వ‌చ్చిన గీత గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలు భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈమూవీతో కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

vijay devarakonda puri

ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు ఈమూవీని నిర్మిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ తో సినిమా చేయ‌డానికి చాలా మంది ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. అందులో మ‌న టాలీవుడ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం ఎదురుచూస్తున్నాడ‌ట‌. విజ‌య్ కోసం పూరీ ఓ క‌థ‌ను సిద్దం చేశాడ‌ని తెలుస్తుంది. డియ‌ర్ కామ్రేడ్ షూటింగ్ కు వెళ్లిన పూరీ అక్కడ విజయ్ కి క‌థ వినిపించిన‌ట్టు స‌మాచారం.

hero ram puri jagannth

పూరీకి విజ‌య్ వాళ్ల నాన్న కొంచెం క్లోజ్ అవ్వ‌డంతో ఎలాగైనా విజయ్ తో సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు. పూరీ ఈ మ‌ధ్య‌లో తీసిన సినిమాలు అట్ట‌ర్ ప్లాప్ కావ‌డంతో ఆయ‌న‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న రామ్ తో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -